Share News

మూల్యాంకనానికి రాలేం !

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:10 AM

మూల్యాంకన విధులకు నియమించిన టీచర్లలో కొందరు ముఖం చాటేయడం.. మార్కుల టోట లింగ్‌, స్కానింగ్‌, నమోదు కోసం ప్రవేశపెట్టిన ట్యాబ్‌లలో కొన్ని సరిగా పనిచేయకపోవడం.. అకస్మాత్తుగా పెనుగాలులతో కూడిన వర్ష బీభ త్సంతో స్పాట్‌ శిబిరం వెలుపల వేసిన టెంట్‌లు ఎగిరిపోవడం, వాహనాలు పక్కకు ఒరిగిపోవ డం.. తదితర స్వల్ప పరిణామాల మధ్య సోమ వారం స్థానిక సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు లో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.

మూల్యాంకనానికి రాలేం !
సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డీఈవో వెంకటలక్ష్మమ్మ

గైర్హాజరైన వారికి షోకాజ్‌ నోటీసులు .. డీఈవో హెచ్చరిక

పది మూల్యాంకనం ప్రారంభం

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మూల్యాంకన విధులకు నియమించిన టీచర్లలో కొందరు ముఖం చాటేయడం.. మార్కుల టోట లింగ్‌, స్కానింగ్‌, నమోదు కోసం ప్రవేశపెట్టిన ట్యాబ్‌లలో కొన్ని సరిగా పనిచేయకపోవడం.. అకస్మాత్తుగా పెనుగాలులతో కూడిన వర్ష బీభ త్సంతో స్పాట్‌ శిబిరం వెలుపల వేసిన టెంట్‌లు ఎగిరిపోవడం, వాహనాలు పక్కకు ఒరిగిపోవ డం.. తదితర స్వల్ప పరిణామాల మధ్య సోమ వారం స్థానిక సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు లో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది. విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి నేరుగా స్పాట్‌ విధులకు నియమితులైన వారిలో కొందరు ఏఈలు, స్పెషల్‌ అసిస్టెంట్లతో పాటు వివిధ కారణాలపై మినహాయింపు పొం దిన వారి స్థానే బఫర్‌ (ప్రత్యామ్నాయ) జాబి తా నుంచి జిల్లా విద్యాశాఖ నియమించిన వారి లోనూ పలువురు మూల్యాంకన విధులకు తొలిరోజునే ఏ సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సంబంధిత టీచర్లందరికీ డీఈవో వెంకటలక్ష్మమ్మ గట్టి వార్నింగ్‌ను ఇచ్చారు. వారంతా సోమవారం సాయంత్రం లేదా మం గళవారం ఉదయాని కల్లా స్పాట్‌ కేంద్రంలో రిపోర్టు చేయకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవా నికి స్పాట్‌ క్యాంపునకు అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 773 మంది సీఈలు, ఏఈలు, స్పెషల్‌ అసిస్టెంట్లు అవసరమవుతారని అంచనా వేసి ఆ మేరకు నియామక పత్రాలను టీచర్ల మొబైల్‌ ఫోన్లకే లీప్‌ యాప్‌ ద్వారా జారీచేశారు. వీరిలో 70 నుంచి 100 మంది వరకు తొలిరోజు గైర్హాజరైనట్టు సమాచారం. గణితం, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనా నికి పూర్తిస్థాయిలో టీచర్లందరూ రిపోర్టు చేయ గా, మిగిలిన సబ్జెక్టుల్లో కొరత ఏర్పడింది. తొలి రోజున నిర్దేశిత షెడ్యూలు ప్రకారమే ఒక్కో ఏఈకి 20 చొప్పున జవాబుపత్రాలు మూల్యాం కనం నిమిత్తం ఇచ్చి పూర్తి చేయించారు. జవా బుపత్రాలపై వున్న బార్‌కోడ్‌లను స్కాన్‌ చేయా ల్సి ఉండగా పలు ట్యాబ్‌లు మొరాయించడం వల్ల సాంకేతిక సమ స్యలన్నింటినీ సరిచేసి మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో ట్యాబ్‌లతో నిర్ణీత కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణ యించారు. మూల్యాంకన శిబిరం వద్ద ఎస్సీఈ ఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి పరిశీలించారు.

మూల్యాంకనం జరుగుతున్న సెయింట్‌ గ్జేవి యర్‌ హైస్కూలులో అన్నీ పక్కాభవనాలే కావ డంతో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం బీభత్సాన్ని సృష్టించినా ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగింది. పది నిమిషాలపాటు మూ ల్యాంకన ప్రక్రియను నిలిపివేసి అనంతరం కొనసాగించారు. జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

విధులకు ఎందుకీ జాప్యం..

మధ్యాహ్నం 12 గంటలు దాటినా స్పాట్‌ విధులకు నియమితులైన టీచర్లు మూల్యాంకన శిబిరంలో రిపోర్టు చేయకుండా రోడ్డుపై వేచి ఉండడాన్ని గమనించిన డీఈవో వెంకట లక్ష్మమ్మ డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు, పెదపాడు ఎంఈవో నరసింహమూర్తిలను వెంటబెట్టుకుని వారి వద్దకు వెళ్లారు. కొందరు టీచర్లు ఏవో సాకులు చెప్పడంతో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి స్వయంగా స్పాట్‌ క్యాంపులోకి పంపించారు.

నల్లబ్యాడ్జీలతో ‘ఫ్యాప్టో’ నిరసన

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పీఆర్సీ నియామకం, పెండిం గ్‌ డీఏల విడుదల, 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌)ని ప్రకటించాలని, మూల్యాంకన విధులకు పారితోషకాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఆయా సంఘాల జిల్లా నాయకులు స్పాట్‌ కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసిన తెలిపారు. పలు వురు టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మూల్యాం కన విధులకు హాజరయ్యారు.

Updated Date - Apr 07 , 2026 | 12:10 AM