Share News

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:11 AM

పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం శిబిరం సోమ వారం నుంచి స్థానిక సెయింట్‌ గ్జేవియర్‌ స్కూలులో ప్రారంభం కానుంది.

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

సీసీ కెమెరాల ఏర్పాటు.. 785 మంది సిబ్బంది.. 1,88,978 జవాబుపత్రాలు

మూడు దశల్లో మార్కుల టోటలింగ్‌

నెలాఖరులోగా ఫలితాల విడుదల..?

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం శిబిరం సోమ వారం నుంచి స్థానిక సెయింట్‌ గ్జేవియర్‌ స్కూలులో ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు కొనసాగుతుంది. వివిధ జిల్లాల నుంచి మూల్యాంకనం నిమిత్తం 1,88,978 జవాబుపత్రాలు జిల్లాకు అందాయి. వీటిని దిద్దేందుకు సబ్జెక్టుల వారీగా బోధనానుభవం వున్న 785 మంది సీఈలు, ఏఈలు, స్పెషల్‌ అసిస్టెంట్లను జిల్లా విద్యాశాఖ నియమించింది. మార్కుల టోటలింగ్‌లో తప్పిదాలను నివారించేందుకు మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను సీఈ, ఏఈ, స్పెషల్‌ అసిస్టెంట్‌లతో ఈ దఫా మూడు దశల్లో వెరిఫై చేసిన తర్వాతే మార్కులను ట్యాబ్‌లో నమోదు చేసి ఆన్‌లైన్‌ విధానంలో అక్కడికక్కడే పాఠశాలవిద్య పరీక్షల రాష్ట్ర విభాగానికి నేరుగా పంపి స్తారు. పారదర్శకతతో కూడిన పనివేగం, ఫలితాలను త్వరితగతిన ప్రకటించడానికి ఉపకరిస్తుందని భావిస్తు న్నారు. 15వ తేదీ నాటికి మూల్యాంకనం ప్రక్రియ ముగు స్తున్నందున ఈ నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేసేందుకు అవకాశం ఉంది.

ఉదయం 20, మధ్యాహ్నం 20 వంతున జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేలా నిబంధన విధించారు. ఈనెల 15 వరకు రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వాల్యూయేషన్‌ ప్రక్రియ సాగుతుంది. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపా ధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఏ అసౌకర్యం కలుగ కుండా, వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ జాగ్రత్తలు చేపట్టింది. మూల్యాంకన కేంద్రంలో టాప్‌ ఫ్లోర్‌ను, ఆడిటోరియంను స్పాట్‌ వాల్యూయేషన్‌కు వినియోగించకుండా, కేవలం గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంత స్తుల్లోని గదులను మాత్రమే మూల్యాంకనానికి కేటాయిం చారు. మొబైల్‌ ఫోన్లను వినియోగించరాదని, స్పాట్‌ కేంద్రంలోకి తీసుకురావద్దని అధికారులు సూచించారు. మూల్యాంకనం జరిగే ప్రతిగదిలో సీసీ కెమెరాలను అమ ర్చి, వాటిని ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర డైరెక్టర్‌ కార్యా లయానికి అనుసంధానం చేశారు. మరోవైపు సబ్జెక్టుల వారీగా మూల్యాంకనాన్ని పర్యవేక్షించేందుకు నియమించి న చీఫ్‌ ఎగ్జామినర్‌కు కేటాయించిన ఏఈలు, స్పెషల్‌ అసి స్టెంట్ల నియామకాలను జిల్లా విద్యాశాఖతో నిమిత్తం లేకుండా రాష్ట్ర కార్యాలయమే చేపట్టింది. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (అపోస్‌)దూరవిద్య పదోతరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఇదే కేంద్రంలో ఈనెల 11 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:11 AM