Share News

నాగలి పట్టి.. ట్రాక్టర్‌ నడిపి..

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:38 AM

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

నాగలి పట్టి.. ట్రాక్టర్‌ నడిపి..
లోపూడిలో నాగలి దున్నుతున్న మంత్రి పార్థసారథి

జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి.. హాజరైన మంత్రి పార్థసారథి, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు

ముసునూరు/ఏలూరు రూరల్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముసునూరు మండలం లోపూడిలో సోమవారం జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకుల్లో మంత్రి పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌కే హబీబ్‌ బాషా, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్నలతో కలిసి మంత్రి ఎద్దులు, నాగలి, పలుగు తదితర వ్యవసాయ పనిముట్లు, భూమాతకు పూజలు నిర్వహించారు. పొలంలో విత్తనాలు చల్లి, నాగలితో దుక్కిదున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సబ్సిడీ, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత నిధులను అర్హులైన రైతులకు జమ చేశా’మన్నారు. రైతులు, మహిళలు మంత్రిని సన్మానించారు. నూజివీడు ఏఎంసీ చైర్మన్‌ కుంపటి అరుణ, మండల టీడీపీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు, తహసీల్దార్‌ దాసరి ప్రశాంతి, ఏవో చాముండేశ్వరి, ఎంపీడీవో ఏసుబాబు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌ మండలం చొదిమెళ్ళలో రైతులతో కలిసి పొలంలోకి దిగిన కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సంప్రదాయ దుక్కి దున్ని ఏరువాక పౌర్ణమికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. రైతుల తో మమేకమై నాగలి పట్టి దుక్కి దున్నడం, ట్రాక్టర్‌ నడపడం ఆకర్షించింది. కలెక్టర్‌ మాట్లాడు తూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సంప్రదాయ విలువలను కొనసాగించా లని సూచించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తోంద న్నారు. మేయర్‌ నూర్జహాన్‌, ఆర్టీసీ రీజనల్‌ చైర్మ న్‌ అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్‌ పార్థసారథి, వ్యవసాయశాఖ జేడీ హబీబ్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:38 AM