Share News

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం కేసులో వైసీపీ కార్యకర్తల అరెస్టు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:12 AM

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం కేసులో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం కేసులో  వైసీపీ కార్యకర్తల అరెస్టు

లక్కవరపుకోట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం కేసులో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌.కోట సీతారాంపురం జంక్షన్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఈనెల 15న అర్ధరాత్రి ధ్వంసం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు నింది తులను పట్టుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వీరిని విలేకర్ల ఎదుట హాజరు పరిచారు. ఈసందర్భంగా డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐ ఎల్‌.అప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తూర్పాటి అనీల్‌, జుత్తాడ రవిచంద్రరావులను గొల్జాం జంక్షన్‌ వద్ద పట్టుకున్నామని చెప్పారు. గత నాలుగు రోజులుగా గాలించి, చివరకు పట్టుకుని, అరెస్టు చేశామని తెలిపారు. వీరిద్దరిని విచారించగా రాజకీయ దురుద్దేశంతో ఈ పనికి పూనుకున్నామని, తాము వైసీపీకి చెందిన కార్యకర్తలమని చెప్పారని సీఐ తెలిపారు. గ్రామంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు అంగీకరించారని పేర్కొన్నారు. నిందితుల ను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఎస్‌ఐ నవీన్‌పడాల్‌, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:12 AM