యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:16 AM
కొండతామరాపల్లి గ్రామానికి చెందిన ఎండ ఆనంద్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గంట్యాడ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కొండతామరాపల్లి గ్రామానికి చెందిన ఎండ ఆనంద్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధిం చి ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎండ దేవుడు, సంతో షిలకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండో కుమారుడు ఆనంద్ గ్రామంలోని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా గ్రామంలో ని వినాయకుడు నిమజ్జనంలో లైటింగ్ పనులు చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంటిలో భోజనం చేసి, బయటకు వెళ్లిన యువకుడు కనిపించకపోవడంతో కు టుంబ సభ్యులు వెతికారు. పక్కనే ఉన్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటా న్ని గమనించారు. వెంటనే గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి, ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆనంద్ చనిపో యేముందు తన ఫోన్‌లో ‘అమ్మ నాన్న సారీ’ అంటూ స్టేటస్ పెట్టినట్టు ఉంది.