యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:08 AM
పార్వతీపురంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
పార్వతీపురంటౌన్, జూలై 9(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. పట్టణ పోలీసులు, బంధువుల కథనం మేరకు.. పట్ట ణంలోని తెలకల వీధికి చెందిన గెద్ద తారక్(31) కొద్ది రోజులుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరిపోసుకున్నాడని తారక్ తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పట్టణ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ గోవిందరావుకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తారక్ మృతదేహానికి జిల్లా కేంద్రాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.