యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:52 PM
విశాఖపట్నం సారా గ్రామ కాలనీకి చెందిన దువ్వాడ ప్రేమ్‌కుమార్(31) మంగళవారం సాయంత్రం విజయ నగరం గోకపేట వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
విజయనగరం క్రైం, మార్చి 24 (ఆంధ్ర జ్యోతి): విశాఖపట్నం సారా గ్రామ కాలనీకి చెందిన దువ్వాడ ప్రేమ్‌కుమార్(31) మంగళవారం సాయంత్రం విజయ నగరం గోకపేట వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఒకటో పట్టణ సీఐ చక్రవర్తి అందించిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినా పిల్లలు లేరు. మద్యానికి బానిస కావడంతో పాటు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో ఇంటి వద్ద ద్విచక్ర వాహనంపై బయలుదేరి.. విజయనగరం వచ్చాడు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం పెట్టి చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి జేబులోనున్న సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శ్రీనివాసరావు వచ్చి తన కుమారుడని గుర్తించారు. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.