యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:24 AM
మండల కేంద్రానికి చెందిన భోగి కనక రాజు(28) అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతిచెందాడు.
సంతకవిటి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి చెందిన భోగి కనక రాజు(28) అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ ఆర్.గోపాలరావు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కనకరాజు గురువారం తన తల్లితో నగదు విషయంలో గొడవ పడ్డాడు. ఈక్రమంలో మన స్థాపం చెందిన ఆయన.. గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి, మెరు గైన చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం కనకరాజు మృతి చెందాడు. తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.