పోటీ పరీక్షల్లో యువత ప్రతిభచూపాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:55 PM
గ్రంఽథాలయం లోని పుస్తక పఠనం ద్వారా నిరుద్యోగ యువత వివిద ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ప్ర తిభ చూపాలని శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు.
శృంగవరపుకోట, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గ్రంఽథాలయం లోని పుస్తక పఠనం ద్వారా నిరుద్యోగ యువత వివిద ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ప్ర తిభ చూపాలని శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు. బుధవారం ఎస్.కోట శాఖా గ్రంథాలయం లో రూ.30లక్షలఎంపీ ల్యాడ్స్ తో ఈ నూతన భవన నిర్మా ణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఎస్.కోటలోశాఖా గ్రంథా లయ భవన నిర్మాణానికి అదనపు నిధులు మంజూరుచేసేలా విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్‌తో మాట్లాడుతానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు, ఎంపీపీ సండి సోమేశ్వరరావు, టూరిజం రాష్ట్ర డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు డోకుల చిన అచ్చెన్నాయుడు, కోట్యాడ జగదీష్, నాయకులు రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.