‘యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి’
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:01 AM
యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బెలగాం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి యువత పాల్గొని జానపద నృత్యాలు, గీతాలు, వీధి నాటకాలు, కవిత్వం, పెయింటింగ్‌లో ప్రతిభ ప్రదర్శించారు. విజేతలకు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వారికి మెరుగైన శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. జానపద నృత్యాలు విభాగంలో సాలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రథమ స్థానం, పార్వతీపురం టీఆర్‌ఎంఎం విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. జానపద గీతాలు విభాగంలో పార్వతీపురం జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రథమ స్థానం, పార్వతీపురం శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ద్వితీయ స్థానం పొందారు. వీటి నాటకం విభాగంలో బి.అభిషేక్ బృందం ప్రథమ, బి.ఈశ్వరరావు బృందం ద్వితీయ స్థానం సాధించారు. కవిత్వం పోటీల్లో శ్రీసాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థిని వి.హాసిని ప్రథమ బహుమతి, పీఎస్‌ఎం వాసవి జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్.ఎం.నికిత ద్వితీయ స్థానం పొందారు. పెయింటింగ్ విభాగంలో పీఎస్‌ఎం వాసవి జూనియర్ కళాశాల విద్యార్థిని కె.విష్ణు ప్రియ ప్రథమ, ఎశ్యామల ద్వితీయ స్థానం సాధించారు. కార్యక్రమంలో సెట్విజ్ సీఈవో వి.వి.అప్పలనాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హరప్రసాద్, డీఈవో బ్రహ్మాజీ పాల్గొన్నారు.