చంపావతి నదిలో యువకుడి గల్లంతు
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:16 AM
: డెంకాడ మండలంలోని డి.కొల్లాం వద్ద చంపావతినదిపై గల డ్యామ్ వద్దకు స్నేహితులతో వెళ్లిన పూసపాటిరేగ మండలంలో చౌడవాడ పంచాయతీ పరిధిలోగల కృష్ణాపురానికి చెందిన పులపా వెంకట్రావు(22) నదిలో గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది.
స్నేహితులతో డి.కొల్లాం డ్యామ్‌కు వెళ్లి..
చంపావతి నదిలో యువకుడి గల్లంతు
ఫ సాయంత్రం వరకూ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు
పూసపాటిరేగ, నవంబరు17(ఆంధ్రజ్యోతి): డెంకాడ మండలంలోని డి.కొల్లాం వద్ద చంపావతినదిపై గల డ్యామ్ వద్దకు స్నేహితులతో వెళ్లిన పూసపాటిరేగ మండలంలో చౌడవాడ పంచాయతీ పరిధిలోగల కృష్ణాపురానికి చెందిన పులపా వెంకట్రావు(22) నదిలో గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గోవిందపురంలో గల తన ఇద్దరు స్నేహితులతో వెంకట్రావు ఉదయం తన బైక్ సర్వీసింగ్‌కు అని బయలుదేరాడు. సర్వీసింగ్‌కు ఇచ్చి అక్కడి నుంచి సరదాగా తనతోపాటు ఉన్న స్నేహితులతో డి.కొల్లాం డ్యామ్‌కు వెళ్లాడు. డ్యామ్ వద్ద సరదాగా గడుపుతున్న సమయంలో గల్లంతైనట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలుసుకొన్న స్థానిక ఎస్‌ఐ సన్యాసినాయుడు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వచ్చి మంగళవారం సాయంత్రం వరకూ గాలించినా ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడటంతో రేపు గాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు. వెంకట్రావు బీటెక్ పూర్తిచేసుకొని ఇంటివద్దే ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నాడు. వెంకట్రావుకు తలిదండ్రులు రామన్న, ఇందిర ఉన్నారు.