చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:17 AM
లింగాలవలస గ్రామం వద్ద గత నెల 30న గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన బోర చిన్న(26) అనే యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
డెంకాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): లింగాలవలస గ్రామం వద్ద గత నెల 30న గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన బోర చిన్న(26) అనే యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం నందికపేట గ్రామానికి చెందిన బోర రాంబాబు, బోర చిన్న ఇద్దరు అన్నదమ్ములు గత నెల 30న ఆటోపై లింగావలస దగ్గర టైర్ పంక్చర్ వేయించేందుకు వెళ్లారు. రోడ్డు అవతల టిఫిన్ చేసి, తిరిగి రోడ్డు దాటు తుండగా.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం చిన్న ను బలంగా ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే 108 వాహ నంపై ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం విజయ నగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడి తండ్రి సోమిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆరంగి సన్యాసినాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.