విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:56 PM
విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన కొత్తవలస పంచాయతీ బలిఘట్టాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
కొత్తవలస, జూన్ 6(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన కొత్తవలస పంచాయతీ బలిఘట్టాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస పంచాయతీ మిందివలస గ్రామానికి చెందిన కోరుబిల్లి బండిరాజు(32) రోజువారీ కూలి పనులు చేస్తుంటాడు. బలిఘట్టాం గ్రామంలో ఇంటి నిర్మాణ పనులకు తాపీమేస్త్రీలతో వెళ్లేవాడు. శనివారం నిర్మాణం పూర్తయిన ఓ ఇంటిపై ఉన్న కర్రలను తొలగిస్తున్న సమయంలో ఆ ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లకు బండిరాజు చేయి తగిలింది. దీంతో ఆయన షాక్‌కు గురై అక్కడక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బండిరాజు అన్న కోరుబిల్లి శ్రీను అక్కడికి చేరుకున్నాడు. అలాగే విద్యుత్ శాఖ ఏఈ సూరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని.. విద్యుత్ వైర్లను పరిశీలించారు. మృతుడి అన్న శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు.