విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - May 25 , 2026 | 12:12 AM
విద్యుదాఘాతంతో యువ కుడు మృతిచెందిన ఘటన మండలంలోని నీలావతి గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది.
గంట్యాడ, మే 24(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో యువ కుడు మృతిచెందిన ఘటన మండలంలోని నీలావతి గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గంట్యాడ ఏఎస్‌ఐ రమణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ లంలోని నీలావతి గ్రామానికి చెందిన కాట వీరస్వామి, ఎర్ర య్యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ వివాహం అయ్యింది. కుమారుడు చినబాబు(25) బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఉద్దేశంతో కాకినాడలో ఓ కోచింగ్ సెంటరులో శిక్షణ తీసుకున్నాడు. ఈనెల 22న కాకినాడ నుంచి స్వగ్రామైన నీలావతికి వచ్చాడు. శనివారం రాత్రి భోజ నం చేసిన అనంతరం పక్కనే ఉన్న కాట గున్నమ్మ ఇంట్లో నిద్ర చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో టేబుల్ ఫ్యాన్ వేసుకుందామని ప్లగ్‌ను స్విచ్ బోర్డులో పెడుతున్న తరుణంలో చినబాబు షాక్ గురై కింద పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చినబాబు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి ఆస రాగా నిలుస్తున్న కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీ రుగా విలపిస్తోంది. దీంతో నీలావతి గ్రామంలో విషాద ఛాయలు అలముకు న్నాయి. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.