Share News

నేలబావిలో పడి యువకుడి మృతి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:26 AM

రేగిడి ఆమదాలవలస మండలం అప్పన్న అగ్రహారం గ్రామానికి చెందిన అల్లిన అశోక్‌(26) అనే యువకుడు ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృతిచెందాడు.

నేలబావిలో పడి యువకుడి మృతి

రేగిడి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రేగిడి ఆమదాలవలస మండలం అప్పన్న అగ్రహారం గ్రామానికి చెందిన అల్లిన అశోక్‌(26) అనే యువకుడు ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ వి.బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 16 తేదీ ఉదయం 9 గంటల కు ఇంటి నుంచి వెళ్లిన అశోక్‌ తిరిగి రాలేదని కుటుంబీకులు ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసు లు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం మజ్జిరాముడుపేట గ్రామం సమీపంలోని నేలబావిలో అశోక్‌ మృతదేహం లభ్యమైంది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు నేలబావిలో పడి ఉండవచ్చునని మృతుడి తల్లిదండ్రు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:27 AM