Share News

బావిలో పడి యువకుడి మృతి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:05 AM

వేపాడ గ్రామంలోని రెడ్డి వారి కల్లాల వద్ద గల బావిలో వల్లంపూడి గ్రామానికి చెందిన మోర్చా విజయ్‌(22) అనే యువకుడు పడి మృతిచెందాడు.

బావిలో పడి యువకుడి మృతి

వేపాడ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వేపాడ గ్రామంలోని రెడ్డి వారి కల్లాల వద్ద గల బావిలో వల్లంపూడి గ్రామానికి చెందిన మోర్చా విజయ్‌(22) అనే యువకుడు పడి మృతిచెందాడు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయ్‌ గత కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం కుటుంబ సభ్యులను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ, వారితో గొడవ పడుతున్నాడు. గత రెం డు రోజుల నుంచి ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. ఈక్రమం లో శనివారం మధ్యాహ్నం రెడ్డివారి కల్లాల వద్ద గల బావిలో విజయ్‌ మృత దేహాన్ని గుర్తించారు. జీవితంపై విరక్తి చెంది విజయ్‌ ఆత్మహత్య చేసుకుని ఉం టాడని అతని బంధువైన వల్లంపూడి గ్రామానికి చెందిన కొమ్మనాపల్లి జ్యోతి.. వల్లంపూడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. ఈమేరకు ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. విజయ్‌ తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం అస్సాంలో ఉంటున్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:05 AM