Share News

వ్యాను ఢీకొని యువకుడి మృతి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:27 AM

మండలంలోని రంగరాయపురం జంక్షన్‌ సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

వ్యాను ఢీకొని యువకుడి మృతి

లక్కవరపుకోట, జూలై 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగరాయపురం జంక్షన్‌ సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొట్లాం గ్రామానికి చెందిన తూర్పాటి రామకృష్ణ (36) కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఎక్సకవేటర్‌ ఆపరేటర్‌గా విధులు ముగించుకుని, తిరిగి గొట్లాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రంగ రాయపురం దగ్గరలో ఎస్‌.కోట నుంచి విశాఖ వెళ్తున్న వ్యాను ఢీకొట్టింది. దీంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:27 AM