లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:07 AM
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
పూసపాటిరేగ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. కందివలస పంచాయతీ పరిధిలో గల సాయిబాబా మందిరం సమీపంలో నక్కానపేట జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ గ్రామానికి చెందిన తిరుమలరాజు సాయివర్మ(32), తన సమీప బంధువైన వెంకటపతిరాజుతో కలిసి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై చింతపల్లి వెళ్లాడు. తిరిగి పూసపాటిరేగకు వస్తుండగా కందివలస పంచాయతీ పరిధిలోని నక్కానపేట జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న సాయివర్మ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి రమాదేవి అందజేసిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ కిరణ్ కేసును నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతుడి తండ్రి గతంలో మృతిచెందారు.