చెరువులో స్నానానికి దిగి యువకుడి మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 12:37 AM
అయోధ్యాపురం పంచాయతీ కాంట్రగడ చెరువు లో సోమవారం సాయంత్రం ఓ యువకుడు స్నానానికి దిగి మృత్యువాత పడ్డా డు.
టెక్కలి, మే 4(ఆంధ్రజ్యోతి): అయోధ్యాపురం పంచాయతీ కాంట్రగడ చెరువు లో సోమవారం సాయంత్రం ఓ యువకుడు స్నానానికి దిగి మృత్యువాత పడ్డా డు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలివీ... ఓ వివాహనికి సంబంధిం చి ఈవెంట్ విఽధులు నిర్వహణకు విజయనగరం జిల్లా జొన్నగడ్డ గ్రామం నుంచి జొన్నగడ్డ భాను(19) అనే యువకుడు తోటి కార్మికులతో కలసి వచ్చాడు. సోమవారం గ్రామానికి సమీపంలో గల చెరువు వద్ద స్నానానికి వెళ్తూ ప్రమాద వశాత్తు మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన భానును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించేసరికే ఆ యువకుడు మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.