Addiction గంజాయి మత్తులో యువత చిత్తు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:18 AM
Youth Crushed by Marijuana Addiction గంజాయి మత్తులో నేటి యువత చిత్తవు తున్నారని, విద్యావంతులైన ఎంతోమంది సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతు న్నారని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. వారి కుటుంబాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి స్తోందన్నారు. బుధవారం కొత్తవలస పెద్దవీధిలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పార్వతీపురం టౌన్, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తులో నేటి యువత చిత్తవు తున్నారని, విద్యావంతులైన ఎంతోమంది సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతు న్నారని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. వారి కుటుంబాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి స్తోందన్నారు. బుధవారం కొత్తవలస పెద్దవీధిలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కొత్తపోలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు కోలాటం ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ.. యువత గంజాయి, మాదక ద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులే చూసుకోవాలన్నారు. ఈ మేరకు పిల్లలపై ఓ కన్నేయాలని సూచించారు. మత్తుతో జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని అందర్నీ తెలియజేయాలన్నారు. రానున్న రోజుల్లో సైబర్ నేరాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకుని రహదారి భద్రత పాటించాలన్నారు. గృహ హింస, లైంగిక వేధింపుల కట్టడికి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.