Youth Creates Ruckus పాలకొండ ఆసుపత్రిలో యువకుడు హల్‌చల్
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:19 AM
Youth Creates Ruckus at Palakonda Hospital పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. చేతిపై గాయంతో వచ్చి.. వీరంగం సృష్టించాడు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న అద్దాలను విరగ్గొట్టి రోగులు, ఆసుపత్రి వర్గాలను భయభ్రాంతు లకు గురి చేశాడు.
అద్దాలు పగులగొట్టి.. వైద్యులపై దాడికి యత్నం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాలకొండ, ఆగస్టు22 (ఆంధ్ర జ్యోతి): పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. చేతిపై గాయంతో వచ్చి.. వీరంగం సృష్టించాడు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న అద్దాలను విరగ్గొట్టి రోగులు, ఆసుపత్రి వర్గాలను భయభ్రాంతు లకు గురి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన అవనాపు కిషోర్ అలియాస్ రమణ ఇటీవల పాలకొండలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా శనివారం చేతిపై గాయం చేసుకున్నాడు. దీంతో బంధువులు 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆసుప్రతికి తరలించారు. అయితే వైద్యం అందించే క్రమంలో యువకుడు ఇష్టమొచ్చి నట్టు ప్రవర్తించాడు. వైద్యులను దుర్భాష లాడి చుట్టుపక్కల ఉన్న అద్దాలను పగులగొట్టాడు. సిబ్బంది, వైద్యులపై దాడికి యత్నించడంతో అక్కడివారు హడలిపోయారు. దీంతో సూపరింటెండెంట్ చిరంజీవి, ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు. నిందితుడు మద్యం లేక గంజాయి మత్తులో ఉండొచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.