Share News

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:10 AM

చీపురుపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో కోరాడ వెంకటేష్‌(35) అనే యువకుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు.

 రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

చీపురుపల్లి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో కోరాడ వెంకటేష్‌(35) అనే యువకుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై జీఆర్పీ ఏఎస్‌ఐ మధుసూధనరావు అందిం చిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్లాం గ్రామానికి చెందిన వెంకటేష్‌ రోజువారీ వేతనం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి జగన్నాథం రెండేళ్ల కిందట మృతిచెందగా, సోదరి కూడా విద్యుదాఘాతంతో గత ఏడాది మృతి చెందింది. దివ్యాంగురా లైన తల్లి లవకుమారిలో కలిసి వెంకటేష్‌ కర్లాంలో ఉంటున్నాడు. గత కొంత కాలంగా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతు న్నాడు. పేదరికం, కుటుంబ నేప థ్యం కారణంగా వెంకటేష్‌కు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మన స్థాపానికి గురైన వెంకటేష్‌ శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో, దివ్యాం గు రాలైన తల్లి బోరున విలపిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 12:10 AM