ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:24 AM
పారాదిలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
బొబ్బిలి రూరల్, ఆగస్ట్టు 21(ఆంధ్రజ్యోతి): పారాదిలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కఽథనం ప్రకారం.. పారాది గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ (23) విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కెంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు చిన్నమ్మలు, బోడయ్య ు బతుకుతెరువు కోసం చెన్నైలో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల్లో కుమార్తెకు వివాహం చేశారు. ఈనెల 12న చంద్రశేఖర్ స్వగ్రామం పారాది చేరుకుని ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి మొబైల్‌లోని కాల్స్, వాట్సాప్ చాటింగ్ పరిశీలించిన అనంతరం ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తుందని సీఐ నారాయణరావు అను మానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేశారు.