మళ్లీ వచ్చాయ్..
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:42 AM
మండలంలోని పలు గ్రామాల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది.
ఆందోళన చెందుతున్న రైతులు
గరుగుబిల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. కొద్ది రోజుల కొందట కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం మండలాల్లో సంచరించిన ఏనుగులు పరిసర గ్రామాలకు వెళ్లినట్లే వెళ్లి, మళ్లీ వచ్చాయి. బుధవారం తోటపల్లి, నందివానివలసలో సంచరించిన గజరాజుల గుంపు జియ్యమ్మవలస మండలం సింగనాపురం వెళ్లి తిరిగి తోటపల్లి, నందివానివలసకు చేరింది. పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వారం రోజులుగా నందివానివలస, తోట పల్లి, గిజబ, సుంకి, సంతోషపురం, నాగూరు, ఖడ్గవ లస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఏనుగుల తర లింపునకు అటవీశాఖ అధికారులు చర్యలు చేప ట్టాలని రైతులు కోరారు.