Share News

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

ABN , Publish Date - May 18 , 2026 | 11:55 PM

నెల్లిమర్ల నగర పంచాయతీ జర్జాపుపేటకు చెందిన కాళ్ల దీపిక(21) అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

నెల్లిమర్ల, మే 18(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ జర్జాపుపేటకు చెందిన కాళ్ల దీపిక(21) అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. తిరు పతిలోని యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే తిరుపతి నుంచి రోడ్డు మార్గాన పులివెందుల వైపు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు తెలిసింది. ఈమె స్వగ్రామం జర్జాపుపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుము న్నీరవుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది. కుమార్తె అకాలంగా మృతిచెందడంతో శోకసంద్రంలో మునిగారు.

Updated Date - May 18 , 2026 | 11:56 PM