Young Voters పుర పోరులో యువ ఓటర్లే కీలకం
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:17 AM
Young Voters to Play a Key Role in Municipal Elections పురపాలక సంఘం ఎన్నికల్లో యువ ఓటర్లు ఎంతో కీలకంగా మారనున్నారు. ఏటా వారి ఓటింగ్ శాతం పెరుగుతుండడంతో ఇప్పుడు అందరి చూపు వారిపై పడింది. ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనకు ప్రాధాన్యమిచ్చే యువత.. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే శక్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జెన్జీ యువత ఆలోచనలు తెలుసుకోవాలని, డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియో గించుకుని వారితో మమేకమవ్వాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం కూటమి పార్టీల నాయకులకు సూచించారు.
వారి సంఖ్య పట్టణాల్లోనే అధికం
దృష్టి సారిస్తున్న రాజకీయ నేతలు
పార్వతీపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం ఎన్నికల్లో యువ ఓటర్లు ఎంతో కీలకంగా మారనున్నారు. ఏటా వారి ఓటింగ్ శాతం పెరుగుతుండడంతో ఇప్పుడు అందరి చూపు వారిపై పడింది. ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనకు ప్రాధాన్యమిచ్చే యువత.. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే శక్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జెన్జీ యువత ఆలోచనలు తెలుసుకోవాలని, డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియో గించుకుని వారితో మమేకమవ్వాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం కూటమి పార్టీల నాయకులకు సూచించారు. దీంతో స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న యువ ఓటర్లపై రాజకీయ నేతలు దృష్టి సారించారు. పార్వతీపురం పురపాలక సంఘంలో 40,765 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇందులో సుమారు 6,255 మంది వరకు యువ ఓటర్లు ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 23,466 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో సుమారు 3,021 మంది యువ ఓటర్లు ఉన్నట్టు అంచనా. సాలూరు మున్సిపాల్టీలో 41,934 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో యువ ఓటర్లు సుమారుగా 4,225 మంది వరకు ఉన్నారు. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన జెన్జీ యువతరం ప్రయాణ మంతా దాదాపు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లతోనే ముడిపడి ఉంది. ఈ యువ ఓటర్లు అత్యధికంగా పట్టణాల్లోనే ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణ జనాభాలో సుమారు 22 నుంచి 23 శాతం వరకు వారు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పుపాలక సంఘాల్లో యువ ఓటర్లు తీర్పు ఎంతో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.