Share News

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:17 AM

పల్లెల్లో ప్రతి యువకుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

  • మంత్రి శ్రీనివాస్‌

బొండపల్లి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ప్రతి యువకుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కొండకిండాం రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కును ఆయన సోమవారం పరిశీలిం చి.. పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఎంఎస్‌ఎంఈ పార్కును తొలివిడత 26 ఎకరాల్లో చేపట్టిన పారిశ్రామిక ముఖ చిత్రాన్ని పరిశీలించారు. నేల చదును, అంతర్గత రహదారుల ఏర్పాటు, విద్యుత్‌, నీటి సరఫరా తదితర సదుపాయాల కల్పనను అధికా రులను అడిగి తెలుసుకున్నారు. పార్కుల బ్లాక్‌సైజు, పారిశ్రామిక వేత్తలకు భూ కేటాయింపుల వివరాలపై చర్చించి.. పలు సూచనలు చేశారు. ఆసక్తి ఉన్న స్థానిక పారిశ్రామికవేత్తలు, వ్యాపా రులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తో ఏపీఎంఎస్‌ఎంఈ డవలప్‌ మెంట్‌ పోర్టల్‌ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వి.కృష్ణప్రసాద్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కరుణాకర్‌, జేఈఈ రాజేష్‌, తహసీల్దార్‌ డోలా రాజేశ్వరరావు, సీఐ సన్యాసినాయుడుతోపాటు గజపతినగరం జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రాపు సురేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చంనాయుడు, మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు ముంజేటి పార్వ తి, నంబూరి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:17 AM