చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:07 AM
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్లి శంకరరావు (22) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సీతానగరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్లి శంకరరావు (22) చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. విజయనగరంలో వంట పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న శంకరరావును బొండపల్లి మండలంలోని గరుడబిల్లి జంక్షన్ వద్ద గజపతినగరం వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గాయపడిన శంకరరావు విజయనగరంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బొండపల్లి ఎస్ఐ యు.మహేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.