చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:06 AM
మండలంలోని బొడ్డవర చెక్‌పో స్టు వద్ద ఈనెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మజ్జి రమేష్(17) అనే యువకుడు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర చెక్‌పో స్టు వద్ద ఈనెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మజ్జి రమేష్(17) అనే యువకుడు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14న అల్లూరి సీతారామరాజు జిల్లా చిలకలగెడ్డ పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. బొడ్డవర చెక్‌పోస్టు వద్ద వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో వెనుక కూర్చున్న మజ్జి రమేష్, బాలరాజులు రోడ్డుపై పడిపోయారు. వెంటనే వీరిని ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీనిపై సంబంధిత అనంతగిరి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆ స్టేషన్ హెచ్‌సీ చిన్నారావు వచ్చి, కేసు నమోదు చేసుకున్నారు.