చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - May 08 , 2026 | 12:31 AM
మండలంలో బూరపేట జంక్షన్ వద్ద గత నెల ఏప్రిల్ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన తిప్పలవలస గ్రామానికి చెందిన రాయితి కొండ(19) అనే యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
పూసపాటిరేగ, మే 7(ఆంధ్రజ్యోతి): మండలంలో బూరపేట జంక్షన్ వద్ద గత నెల ఏప్రిల్ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన తిప్పలవలస గ్రామానికి చెందిన రాయితి కొండ(19) అనే యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొండ తన ద్విచక్రవాహనంపై తన మేనల్లుడిని డెంకాడ మండలంలోగల నాతవలస వద్ద విడిచిపెట్టి, తిరిగి వస్తుండగా బూరపేట జంక్షన్ వద్ద వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రాయితి అప్పలస్వామి ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసును నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.