చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - May 06 , 2026 | 12:10 AM
మండలంలోని అలమండ గ్రామానికి చెందిన బొబ్బిలి సన్యాసినాయుడు(31) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెంది నట్టు ఏఎస్‌ఐ వేంకటేశ్వరరావు తెలిపారు.
జామి, మే 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలమండ గ్రామానికి చెందిన బొబ్బిలి సన్యాసినాయుడు(31) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెంది నట్టు ఏఎస్‌ఐ వేంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలమండకు చెందిన సన్యాసి నాయుడు కొత్తవలస శారద పరిశ్రమలో డైలీ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన మద్యానికి బానిసయ్యాడు. గత నెల 21న మద్యం మత్తులో పురుగు మం దు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో అతని పరిస్థితి విషమిం చింది. దీంతో గత నెల 30న విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మంగళవారం సాయంత్రం ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసు లు కేసు నమోదు చేశారు.