రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:07 AM
నెల్లిమర్ల పరిధిలోని పినతరిమి జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.
నెల్లిమర్ల, జూన్ 7(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల పరిధిలోని పినతరిమి జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఈఘట నపై నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు గ్రామానికి చెందిన పొట్నూరు మహాలక్ష్మీనాయుడు ఆదివారం తన ద్విచక్ర వాహ నంపై నెల్లిమర్ల వైపు వస్తున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో మహాలక్ష్మీనాయుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.