రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:22 AM
మండలంలోని లొట్లపల్లి సంత వద్ద శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొమ్మేటీ మణికంఠ(26) మృతిచెందాడు.
జామి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని లొట్లపల్లి సంత వద్ద శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొమ్మేటీ మణికంఠ(26) మృతిచెందాడు. వివ రాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా మాడుగుల కింతల మల్లాపురం గ్రామానికి చెందిన నర్శింగరావు కుమారుడు అయిన మణికంఠ.. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలో తన అక్క, బావతో కలిసి ఉంటున్నాడు. లొట్లపల్లి సంతలో పశువులు తరలించే వారి వద్ద ఉన్న వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కొత్త వలస వెళ్లి, తిరిగి అలమండ వెళ్తున్నాడు. అలమండలోని తన అక్క ఇంటి సమీ పంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి, బోల్తా పడింది. దీంతో మణి కంఠ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే మణికంఠ తల్లి చిన్నతనంలో చనిపోవడంతో తన అక్క, బావల వద్దే ఉంటున్నాడు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు అందలే దని ఎస్‌ఐ వీరజనార్దన్ తెలిపారు. మృతుడి తండ్రి తన స్వగ్రామం అయిన కింతల మల్లాపురంలో పోస్ట్‌మన్‌గా పనిచేస్తున్నారు. ఈయన రెండు రోజుల కిందట ఉద్యోగ విరమణ చేశారు. తన పిల్లలతో సంతోషంగా గడుపుదామను కున్న తరుణంలో కుమారుడు మృతిచెందడంతో విషాదంలో మునిగిపోయారు.