Share News

చెట్టును ఢీకొని యువకుడి మృతి

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:23 AM

కోమటిపల్లి శివారునపాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట మండలం పణు కువలస గ్రామానికి చెందిన వీపు గంగరాజు మృతిచెందాడు.

చెట్టును ఢీకొని యువకుడి మృతి

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): కోమటిపల్లి శివారునపాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట మండలం పణు కువలస గ్రామానికి చెందిన వీపు గంగరాజు మృతిచెందాడు. ద్విచక్ర వాహ నంపై స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టుకు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. 108 వాహనంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. స్థానికుల కథనం ప్రకారం గంగరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడని, విశాఖపట్నంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం నుంచి జియ్యమ్మవలస మండలం గంగన్నపాడులో గ్రామ దేవత పండుగకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. అం దివచ్చిన కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు పార్వతమ్మ, రాముడు గుండెల విశేలా రోదించారు. ఈ ఘటనపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 12:23 AM