రైలు నుంచి జారి పడి యువకుడు మృతి
ABN , Publish Date - May 09 , 2026 | 12:24 AM
విశాఖపట్నం నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న పాసింజర్ రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందాడు.
గజపతినగరం, మే 8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న పాసింజర్ రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందాడు. శుక్రవారం బొబ్బిలి రైల్వే జీఆర్‌పీ హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామం చిన్నవీధికి చెందిన పల్ల అప్పలనాయుడు (25)... సింహాచలం నుంచి పార్వతీపురం వెళ్లేందుకు గురువారం సాయంత్రం విశాఖపట్నం -భవానీపట్నం పాసింజర్ రైలు ఎక్కాడు. గజపతినగరం రైల్వే స్టేషన్ దాటిన తరువాత గుడివాడ గ్రామ సమీపంలో దురదృష్టవశాత్తూ రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు హెచ్‌సీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.