Share News

కారు ఢీకొని యువకుడి మృతి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:16 AM

మండలంలోని మరుపల్లి ఓలమ్‌ కంపెనీ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

కారు ఢీకొని యువకుడి మృతి

గజపతినగరం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని మరుపల్లి ఓలమ్‌ కంపెనీ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. హెచ్‌సీ భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన చొక్కాపు శేఖర్‌రావు(29) శనివారం ద్విచక్రవాహనంపై తన స్వగ్రామం నుంచి గజపతినగరం వైపు వస్తున్నారు. ఓలమ్‌ కంపెనీ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి.. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్‌రావు తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుప త్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించా రు. శేఖర్‌ అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. శేఖర్‌కు రెండేళ్ల కిందట మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేటకు చెందిన ధనలక్ష్మితో వివాహం జరి గింది. గత పదిహేను రోజుల కిందట కుమారుడు పుట్టాడు. ఇంతలోనే కుటుం బంలో విషాదం అలముకుంది. మృతుడు తల్లి చొక్కాపు లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 12:16 AM