Share News

నడిరోడ్డుపై యువకుడి వీరంగం

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:15 AM

కురుపాం బస్టాండ్‌ జంక్షన్‌లో సోమవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన యువకుడు చంద్రవంశం జితేంద్ర ప్రసాద్‌ (26) కొద్దిసేపు వీరంగం సృష్టించాడు.

నడిరోడ్డుపై యువకుడి వీరంగం
నడిరోడ్డుపై స్కూటీపై కూర్చొన్న యువకుడు

కురుపాం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కురుపాం బస్టాండ్‌ జంక్షన్‌లో సోమవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన యువకుడు చంద్రవంశం జితేంద్ర ప్రసాద్‌ (26) కొద్దిసేపు వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై స్కూటీ స్టాండ్‌ వేసి దానిపై కూర్చొని హల్‌చల్‌ చేశాడు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మద్యం మత్తులో యువకుడి చేష్టలకు స్థానికులు, వాహనదారులు భయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో జితేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించామన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 12:15 AM