Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:53 AM

మండలంలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన పాలిక సురేష్‌(25) అనే యువకు డు మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

లక్కవరపుకోట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన పాలిక సురేష్‌(25) అనే యువకు డు మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్‌ తన కుటుంబ సభ్యులకు తెలియకుండా కొన్నేళ్ల కిందట విశాఖ కు చెందిన వి.భార్గవి అనే యువతిని వివాహం చేసుకు న్నాడు. అయితే సురేష్‌ తన కుటుంబాన్ని సరిగా చూసుకోవడం లేదని కొద్దిరోజుల కిందట భార్గవి.. విశాఖ ఫోర్ట్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి, పంపించారు. మళ్లీ వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈక్రమంలో భార్గవి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసుస్టేషన్‌కు రావాలని విశాఖ పోలీసు లు తెలిపారు. ఈక్రమంలో సురేష్‌ ‘ముందు మీరు పదండి.. మీ వెనుక నేను వస్తాన’ని తన కుటుంబ సభ్యులకు చెప్పి స్వగ్రామం కల్లేపల్లిలో ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లిపోయిన వెంటనే సురేష్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:53 AM