Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:25 AM

మదుపాడ గ్రామానికి చెందిన కాలిగిట్ల సురేంద్ర(32) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ నాయుడు శుక్రవారం తెలిపారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

గజపతినగరం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): మదుపాడ గ్రామానికి చెందిన కాలిగిట్ల సురేంద్ర(32) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ నాయుడు శుక్రవారం తెలిపారు. సురేంద్ర తల్లిదండ్రులు గతంలో చనిపోవడంతో ఒక్కడే జీవిస్తున్నాడు. గ్రామంలో ఎలక్ట్రీషియన్‌ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. ఒంటరి జీవితంతో మానసికంగా ఇబ్బందులు పడుతుండేవాడు. ఈక్రమంలో గురు వారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజమున పొరుగున ఉన్న వారు టీ ఇచ్చేందుకు కేకలు వేయగా.. ఇంటిలో నుంచి సమాధానం రాలేదు. దీంతో వారు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. దీంతో వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు. మృతుడి అక్క లక్కాజి రజిని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:25 AM