Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - May 11 , 2026 | 12:26 AM

మండలంలోని రాజాపులోవ పంచాయతీ మహరాజపేట గ్రామానికి చెందిన రౌతు మహేష్‌ (21) ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ వి.పాపారావు ఆదివారం తెలిపారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

భోగాపురం, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజాపులోవ పంచాయతీ మహరాజపేట గ్రామానికి చెందిన రౌతు మహేష్‌ (21) ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ వి.పాపారావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహరాజ పేటకు చెందిన రౌతు మహేష్‌కు తల్లి పైడిరాజుతో పాటు సోద రి పుష్ప ఉన్నారు. మహేష్‌ చిన్నతనంలో తండ్రి మృతిచెందారు. దీంతో తల్లి పైడిరాజు కుటాంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. మహేష్‌ అప్పుడప్పుడు ఏపని ఉంటే ఆ పనికి వెళ్తుండేవాడు. మహేష్‌ సోదరి పుష్పకు ఇటీవల వివాహం అయ్యింది. దీంతో ప్రస్తుతం మహేష్‌ తన తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే కుటుంబ పరిస్థితులు బాగో క, చేయడానికి ఏపని దొరకక, తల్లి పడుతు న్న ఇబ్బందులు చూడలేక మహేష్‌ మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. పైడిరాజు ఎప్పటిలాగే శనివారం తగర పువలస పనికి వెళ్లి, రాత్రి ఇంటికొచ్చి చూసేసరికి.. మహేష్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఉన్నాడు. తన కుమారుడు మృతిచెంది ఉన్నట్టు గుర్తించిన తల్లి గగ్గోలు పెట్టింది. పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.పాపారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 11 , 2026 | 12:26 AM