మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:22 AM
ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మండలంలోని అంబటివలస గ్రామంలో శనివారం చోటుచేసు కుంది.
బొండపల్లి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మండలంలోని అంబటివలస గ్రామంలో శనివారం చోటుచేసు కుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తాళ్లపూడి అప్ప లనాయుడు(35) తాపీమేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. మృతునికి భార్య ధనల క్ష్మి తోపాటు మూడేళ్లు, ఆరేళ్లు వయస్సు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామానికి ఆనుకుని ఉన్న తన బంధువుల మామిడితోటలో తెల్లవారుజాము 4 గంటలకు ఇంటి నుంచి వెళ్లి.. మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య, బంధు వులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు.