జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:28 AM
ఏపీ జూనియర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు 11 స్వర్ణ, 9 రజిత, ఒక కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఏపీ జూనియర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు 11 స్వర్ణ, 9 రజిత, ఒక కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అభినందన సభలో విజేతలను సత్కరించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ, పోషకాహారం, వైద్య సహాయం, క్రీడా పరికరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.చంద్రమోహన్, కోచ్ జోగులును సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, డిఎస్‌డివో శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.
నాణ్యత ప్రమాణాల విషయంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని కలెక్టర్ అన్నారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నాగభూషణరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, అర్‌ఎంవో శ్యామలను అభినందించారు. జిల్లా ఆసుప త్రిలోని 16 విభాగాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం అత్యుత్తమ స్కోర్ సాధించడం సాధారణ విషయం కాదన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మీ, వైద్యులు, వైద్య సిబ్బంది, క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.