నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:16 AM
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మేళా నిర్వహించామని, ఎంపికైన అభ్యర్థులు నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ సీహెచ్ విష్ణుమూర్తి ఆకాంక్షించారు.
సాలూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మేళా నిర్వహించామని, ఎంపికైన అభ్యర్థులు నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ సీహెచ్ విష్ణుమూర్తి ఆకాంక్షించారు. సాలూ రు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్ర దేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కేరీర్ సర్వీస్, కళాశాల జవహార్‌నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 202 మంది అభ్యర్థులు హాజరుకాగా 102మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జాబ్ మేళా కు టాటా ఎలక్ర్టానిక్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ, ఫాక్స్‌కాన్, అపోలో ఫార్మసీ, ముథూట్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీ బ్యాంకు వంటి 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ నాయుడు, జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి సుబ్బి రెడ్డి, జేకేసీ కోఆర్డినేటర్ ఎ.రాంబాబు, ఎన్‌సీఎస్ యంగ్ ప్రొఫెసర్ అజయ్‌కు మార్, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి ఎం.త్రినాథ, జేకేసీ మెంటార్లు పాల్గొన్నారు.