Share News

వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:28 AM

న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వృత్తినైపుణ్యం పెంచుకోవాలని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ తెలిపారు.

వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
మాట్లాడుతున్న దుర్గాప్రసాద్‌

  • హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌

బొబ్బిలి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వృత్తినైపుణ్యం పెంచుకోవాలని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ తెలిపారు. శనివారం బొబ్బిలిలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) జిల్లా అధ్యక్షుడు కండాపు ప్రసాదరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవాదికి చట్టాలపై సమగ్రమైన నాలెడ్జి ఉండాలని తెలి పారు. వివిధ సందర్భాల్లో దిగువస్థాయి నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు వెలువడిన తీర్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని చెప్పారు. చట్టాల్లో చోటుచేసుకునే సవరణలను గమనించాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఏఎల్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కేఎస్‌ సురేష్‌కుమార్‌, స్టేట్‌ బార్‌ మెంబరు బెల్లాన రవి, ఐఏఎల్‌ జిల్లా వైస్‌ప్రెసిడెంట్‌ కండాపు ఫల్గుణరావు, పి.మోహన్‌ మురళీకుమార్‌, రాష్ట్రకార్య వర్గ సభ్యురాలు భాగ్యవతి, విజయనగరం, బొబ్బిలి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రమేష్‌కుమార్‌, బొత్సరవి, ఐఎల్‌ జిల్లాకార్యదర్శి శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:28 AM