Share News

పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలి

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:38 AM

బాలికలు పట్టుదలతో చదివి.. ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు.

పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలి

  • ఎమ్మెల్యే నాగమాధవి

నెల్లిమర్ల, సెప్టెంబరు 11(ఆంధ్ర జ్యోతి): బాలికలు పట్టుదలతో చదివి.. ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. నెల్లిమర్లలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో రూ.1.76 కోట్ల వ్యయంతో, కేజీబీవీలో రూ.2.12 కోట్లతో నిర్మించిన నూతన తరగతి గదులకు ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భోగాపురంలో అంతర్జాతీయ లీప్‌ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల బాలికలు భోగాపురం విమానాశ్రయం చూసేందుకు అనుమతి తీసుకుంటామని ఆమె ఈసం దర్భంగా ప్రకటించారు. డీఈవో మాణిక్యంనాయుడు, ఎంఈవో, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ కేబీబీ రావు, కస్తూరిబా పాఠశాల ఎస్‌వో బి.ఉమా, జనసేన పార్టీ నాయకు లు చనమల్లు వెంకటరమణ, రవ్వా నాని, ఎంఎం.నాయుడు, అప్పికొండ రవికుమార్‌, గంటా సతీష్‌, కరుమజ్జి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

భోగాపురం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కూట మి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ముంజేరు సమీప జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజాదర్బార్‌ నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పల్లంట్ల జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:38 AM