మోదీ సభకు తరలిరావాలి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:04 AM
భోగా పురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం పురస్కరించుకొని నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు తరలిరా వాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి పిలుపునిచ్చారు.
లక్కవరపుకోట, జూలై 29(ఆంధ్రజ్యోతి): భోగా పురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం పురస్కరించుకొని నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు తరలిరా వాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి పిలుపునిచ్చారు. గురువారం ఎల్.కోటలో భోగాపురంలో జరిగే బహిరంగ సభకు సంబంధిం చి జన సమీకరణ కోసం కొవ్వురు, గిద్దలూరు ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, అశొక్‌రెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయ కులు కేబీఏ రాంప్రసాద్, కరెడ్ల ఈశ్వరరావు, చొక్కా కుల మల్లునాయుడు, ఐదు మండలాల తహసీ ల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఫగజపతినగరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రదాని సభను విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి కోరారు. బుధవారం గజపతినగరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వనాయుడు, భవన నిర్మా ణ కార్పొరేషన్ చైర్మన్ వలివలబాబ్జితోపాటు నియోజకవర్గ స్దాయి నాయకులు, కార్య కర్తలతో సమావేశం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, లెంకబంగారునాయుడు పాల్గొన్నారు.