Share News

You are the backbone of the police system. పోలీస్‌ వ్యవస్థకు మీరే వెన్నుముక

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:57 PM

You are the backbone of the police system. పోలీస్‌ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముకని, విధి నిర్వహణలో ఎప్పుడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. మహిళా కానిస్టేబుళ్లునగరం పోలీస్‌ శిక్షణ కళాశాలలో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న 473 మంది (2025-26వ బ్యాచ్‌) మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.

You are the backbone of the police system. పోలీస్‌ వ్యవస్థకు మీరే వెన్నుముక
కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడుతున్న హోంమంత్రి అనిత

పోలీస్‌ వ్యవస్థకు మీరే వెన్నుముక

హోం మంత్రి అనిత

శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

శివంగుల్లా పరేడ్‌ నిర్వహించిన మహిళా కానిస్టేబుళ్లు

విజయనగరం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి):

పోలీస్‌ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముకని, విధి నిర్వహణలో ఎప్పుడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. మహిళా కానిస్టేబుళ్లునగరం పోలీస్‌ శిక్షణ కళాశాలలో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న 473 మంది (2025-26వ బ్యాచ్‌) మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కానిస్టేబుళ్లలో స్ఫూర్తి నింపారు. తొలుత వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబరిచిన వారికి జ్ఞాపికలను అందజేశారు. శాంతికపోతాలను ఎగురవేశారు. అదే విధంగా పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లతో సామూహిక ప్రమాణస్వీకారం చేశారు. కానిస్టేబుళ్ల తల్లిదండ్రులతో మంత్రి మమేకమై శాంతి భద్రతల కోసం పిల్లలను పోలీస్‌ శాఖలో చేర్చినందుకు వారిని అభినందించారు. మహిళా కానిస్టేబుళ్లనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నుముఖని చెప్పారు. ముఖ్యంగా మహిళలు కానిస్టేబుల్‌గా ఉంటే స్టేషన్‌కు భయంతో వచ్చే మహిళలకు మరింత ధైర్యంగా ఉంటుందన్నారు. 9 నెలల కఠిన శిక్షణ జీవితానికి పూనాది లాంటిదని, పోలీస్‌ ఉద్యోగమంటేనే ఎంతో బాధ్యతతో కూడినదని, సమాజంలో ఎంతో ప్రభావంతమైనదన్నారు. పోలీసుల వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, దానివల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని అన్నారు. అందువల్లే పోలీసు శాఖకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నియామకాలు చేపట్టడమే కాకుండా శిక్షణలో ఇచ్చే స్టైఫండ్‌ను రూ.12 వేలకు పెంచాలని చెప్పారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వేసుకున్న యూనిఫాంకు మరింత గౌరవం వచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని మంత్రి కోరారు.

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రజల ధనమానప్రాణాలను రక్షించే కీలక బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. సమాజ రక్షణే వీరి బాధ్యత అని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్‌పీ ఏఆర్‌ దామోదర్‌, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, ఇందుకూరి రఘురాజు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్‌ డా.రామచంద్రరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.కోటేశ్వరబాబు, అడిషనల్‌ ఎస్‌పీలు సీహెచ్‌ శ్రీకాంత్‌, ఎస్‌.వాసుదేవ్‌, డీఎస్‌పీలు , సీఐలు, ఇతర అధికారులు, కేడెట్స్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:57 PM