Yoga పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:15 AM
Yoga Demonstrations at Tourist Destinations యోగాంధ్రలో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరిం చుకుని ఈ నెల 21 వరకు మన్యంలో శిక్షణ కార్యక్రమాలు , పోటీలు నిర్వహించాలన్నారు.
పార్వతీపురం, జూన్7(ఆంధ్రజ్యోతి): యోగాంధ్రలో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరిం చుకుని ఈ నెల 21 వరకు మన్యంలో శిక్షణ కార్యక్రమాలు , పోటీలు నిర్వహించాలన్నారు. యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో 500 మంది చొప్పున పాల్గొనేలా ప్రత్యేక యోగా ప్రదర్శన షెడ్యూల్‌ను ఖరారు చేయాలన్నారు. ఈ నెల 11న తోటపల్లి ఆలయంలో, 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వంచర్‌పార్క్‌లో, 20న పాలకొండ, పార్వతీపురం, సాలూరులో యోగా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. వాటిని ఐసీడీఎస్ పీడీ పర్యవేక్షించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. 21న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి వేడుకలను నిర్వహించనున్నామన్నారు.