దిగుబడి ఆధారంగా పంటల బీమా
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:57 PM
పంటకోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడి ఆధారంగా బీమా వస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.రామారావు తెలిపారు.
జిల్లా వ్యవసాయాధికారి రామారావు
వరి పొలాల్లో పంటకోత ప్రయోగాలు
డెంకాడ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పంటకోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడి ఆధారంగా బీమా వస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.రామారావు తెలిపారు. మండలంలోని అక్కివరం గ్రామ పరిధిలో గల సిడగం నాగేశ్వరరావుకు చెందిన వరి పొలంలో శనివారం పంటకోత ప్రయోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఇంటూ 5 మీటర్లలో పంటకోత ప్రయోగం చేపట్టగా 15.700 కిలోల దిగుబడి వచ్చిందని చెప్పారు. అనగా ఒక ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి చెందిన ఎస్వో రాజేష్, వ్యవసాయ విస్తరణాధికారి కూర్మారావు, ఏఐసీ ఇన్సూరెన్స్ కంపెనీ జిల్లా కోఆర్డినేటర్ గోపి, మండల ఏఎస్వో లోహిత్, వ్యవసాయ విస్తరణాధికారి బి.రామకోటి, ఏఐసీ కంపెనీ ఏజెంట్ రమేష్, రైతులు పాల్గొన్నారు.
ఒమ్మిలో 17.350 కిలోల దిగుబడి నమోదు
నెల్లిమర్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలం లోని ఒమ్మి గ్రామంలో గల ఒక వరి పొలంలో శనివా రం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటకోత ప్రయో గం నిర్వహించారు. ఈ ప్రయోగంలో భాగంగా 5 ఇం టూ 5 మీటర్ల విస్తీర్ణంలో పంటకోత చేపట్టగా 17.350 కిలోల దిగుబడి నమోదయ్యింది. పంట దిగుబడి ఆశా జనకంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. నెల్లిమర్ల మండలంలో ఈ సంవ త్సరం మొత్తం 58 పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సిన ఉండగా, ఇప్పటివరకు 23 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఈసందర్భంగా మండ ల వ్యవసాయాధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ పంటకోత ప్రయోగాల ఫలితాలను సంబంధిత యాప్లో తప్పని సరిగా నమోదు చేయాలని, మిగిలినవి అన్ని పంటకోత ప్రయోగాలను నిర్దేశిత విధి విధానాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంటల బీమా ప్రతినిధి, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.