భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ జాతర
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:00 AM
మండలంలోని పల్లిగండ్రేడులో ఎల్లమ్మ జాతర బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గుర్ల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పల్లిగండ్రేడులో ఎల్లమ్మ జాతర బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూర్వీకుల నుంచి నెల రోజులపాటు పూజారి ప్రతి గ్రామం వెళ్లి జోగి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనం తరం జాతర పురస్కరించుకొని రథాన్ని వీధుల్లో ఊరేగిస్తారు. తర్వాత ఆ రథాన్ని జాతర జరిగే ప్రాంతంలో తీసుకువస్తారు. అక్కడ సిరిమానోత్సవం కన్నుల పండగ నిర్వహిస్తారు. పూజారి సిరిమానును ఎక్కి ప్రజలకను ఆశీర్వదిస్తారు. ఈ సిరిమా నోత్సవాన్ని తిలకించడానికి 12గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
ఫగజపతినగరం, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): మండలంలోని మరుపల్లి ఎల్లమాంబతల్లి జాతర బుధవారం ఘనంగా జరిగింది. గ్రామంలో వెలసిన ఎల్లమాంబ, పరుశరాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునుంచే భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు వరకుభక్తులు బారులు తీరారు.రుద్రాక్షుల, కర్నకోట వంశీయులు పూజారు లుగా వ్యవహరించారు. ఎల్లమ్మతల్లి తొలి పూజారిగా రుద్రాక్షుల సత్యనారాయణ, రెండో పూజారిగా కర్నకోట కసవయ్య సిరిమాను అవరోదించారు. మరుపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.